మాదిగల సింహ గర్జన కరపత్రం ఆవిష్కరణ
అడ్డగూడూరు 01 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఆదివారం రోజు కరపత్ర ఆవిష్కరణ. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న సారథ్యంలో జనవరి 19న హైదరాబాదులో జరగబోయే మాదిగల మహా గర్జనను అడ్డగూడూరు మండలం నుండి వేలాదిగా తరలి వెళ్లి విజయవంతం చేయడం కొరకు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెoలా పరుశరాములు మాదిగ అడ్డగూడూరు మండల ఇంచార్జ్ ఇటికాల ఆంజనేయులు మాట్లాడుతూ..మాదిగల న్యాయప్రదమైన ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలంటూ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగినది కానీ ఈ రాష్ట్రంలో మాలలు తమ అధికార బలంతో వర్గీకరణ అడ్డుకోవడం జరుగుతుంది కానీ మేము మాల సోదరులను కోరేధిఒక్కటే ఏబిసిడి వర్గీకరణ చేసుకొని అన్నదమ్ములు లాగా కలిసి ఉందాం మిత్రులారా కానీ మీరు వక్రబుద్ధితో ఏబిసిడి వర్గీకరణ అడ్డుకుంటే మామాదిగ బిడ్డలమంతా ఏకమై మీకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం..ఏది ఏమైనా ఏబిసిడి వర్గీకరణ కోసం మేడి పాపన్న సారథ్యంలో జనవరి 19న హైదరాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభ ద్వారా మన మాదిగల ఐక్యత ను సత్తాచాటి చెప్పవలసిన సమయం అసన్నమైంది.అని మిత్రబృందం తెలియజేయడం జరిగింది.