పాలేరు నియోజకవర్గ అభివృద్ధి ఆయన ధ్యేయం""ఆయన బాటలోనే మనం పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : పాలేరు నియోజకవర్గ అభివృద్ధి ఆయన ద్యేయం
పేద ప్రజల కళ్ళలో ఆనందం చూడటమే ఆయన లక్ష్యం*
*తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన మహా నాయకుడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి *
*ఆయన బాటలోనే మన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు*.
*శ్రీనివాస రెడ్డి గారు తమకు అప్పజెప్పిన బాధ్యతలు సక్రమంగా అమలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న నియోజకవర్గ నాయకులు*
......*పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి .ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్, jntu యూనివర్సిటీ,నర్సింగ్ కళాశాల,మున్నేరు రిటైనింగ్ వాల్,మున్నేరు నుంచి పాలేరు రిజర్వాయర్ కు నీటి తరలింపు లాంటి బృహత్తర కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించిన ఘనత మన మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది.అంతే కాక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పారదర్శకంగా ఉండలాని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తున్న మంచి మనిషి మన పొంగులేటి గారు.పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల తో పాటు,బీటీ రహదారుల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించిన ఘనత మన మంత్రి వర్యులది.గత ప్రభుత్వం లో పేదలు ఎంతో మంది తమ సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలం లోనే పేదల మోము లో చిరునవ్వు చూడాలని ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు.భూ భారతి చట్టం తీసుకొచ్చి రైతులు ఎన్నో ఏళ్ళుగా పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిన మార్గదర్శి.అంతే కాదు ఏ పదవీ లేనప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం తన సొంత డబ్బులు ఇచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మహామనిషి ఇలా చెప్పుకుంటే పోతే ఆయన జీవితం ఒక చరిత్ర అవుతుంది*
వెన్నపూసల సీతారాములు
నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్