మహిళల విద్యకు దారి దీపం సావిత్రి బాయి పూలే- ఆచార్య కూరపాటి వెంకటనారాయణ

రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ చైర్మన్

Mar 10, 2024 - 20:58
 0  3
మహిళల విద్యకు దారి దీపం సావిత్రి బాయి పూలే- ఆచార్య కూరపాటి వెంకటనారాయణ
మహిళల విద్యకు దారి దీపం సావిత్రి బాయి పూలే- ఆచార్య కూరపాటి వెంకటనారాయణ

మహాత్మ జ్యోతిరావు పూలే మార్గదర్శనంలో సావిత్రీ బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయమేనని రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ కొనియాడారు. ఈరోజు ఫూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ ముందుగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల స్త్రీలకు విద్యను అందిచేందుకు ఎన్నో అవమానాలు,కష్టాలు విమర్శలు దాడులు ఎదుర్కోని ఉక్కు సంకల్పం తో తన కర్త్యవాన్ని నిర్వర్తించిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే అన్నారు. ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో వివక్షత రూపు మాపి అందరికీ విద్య అందిన రోజు మనం ఆమెకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని అభిప్రాయ పడ్డారు.ఈ కార్యక్రమంలో ఆచార్య వడ్డే రవీందర్, ఆచార్య ఎం.సారంగపాణి, డాక్టర్ గజ్జల మల్లేశం, డాక్టర్ ఎం సదాలక్ష్మి, డాక్టర్ దేవోజి నాయక్ ,కుమార్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333