గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి
తిరుమలగిరి 05 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని తొండ ,తాటిపాముల, కోక్య నాయక్ తండ గ్రామపంచాయతీల్లో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ హరిప్రసాద్ మరియు ఎస్సై వెంకట్ రెడ్డి ఎంపీడీవో లాజర్ విద్యుత్ అధికారులు డాక్టర్లు పలువురు అధికారులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ముందస్తు చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు పంట మార్పిడి విధానాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, భూసార పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సహకారం, ఉపాధి హామీ పథకం పనులు, వనమహోత్సవం కార్యక్రమాలు, మొక్కల పెంపకం, హార్టికల్చర్ తోటల అభివృద్ధి, సోలార్ విద్యుత్ వినియోగం వంటి అంశాలపై కూడా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ఈ గ్రామసభల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ గ్రామసభల్లో సర్పంచులు బోయపల్లి కృష్ణయ్య, ప్రేమ్ ప్రసాద్ మరియు విద్యుత్ అధికారులు పోలీసు సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులు వెటర్నరీ డాక్టర్లు ఉపాధ్యాయులు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు....