మహబూబ్ నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
మహేంద్ర సంఘానికి అండగా ఉంటా:- ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు మహేంద్ర సంఘానికి అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మేదర సంఘం (మహేంద్ర) సభ్యులు ఎమ్మెల్యే గారిని కలిసి పలు సమస్యలపైన ఆయనకు వినతిపత్రం అందజేశారు. మేదరి బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని వారు ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల రాములు, జోరిగ ఆంజనేయులు, కందూరు వెంకట్ రాముడు తదితరులు ఉన్నారు.