మంత్రివర్గ విస్తరణకు కౌంట్ డౌన్.. నలుగురికి పదవీ గండం
తెలంగాణ : రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 3 తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు మంత్రులకు పదవి గండం ఏర్పడగా, పలువురి శాఖలు మారనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించి.. ఆయన స్థానంలో ఒక మంత్రిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కేబినెట్లోకి తీసుకునే ప్రచారం కూడా జరుగుతోంది.