మంచినీళ్లకు బదులు మహిళ నోట్లో మూత్రం
మంచినీళ్లకు బదులు మహిళ నోట్లో మూత్రం మద్యం తాగుతూ రాత్రంతా అత్యాచారం .కామాంధులైన స్త్రీ పురుషులతో పాటు ప్రభుత్వాలు సమాజం కూడా బాధ్యత వహించాలి. మద్యం, స్త్రీ ని మార్కెట్ వస్తువుగా చూపడం కారణాలు కావా
- వడ్డేపల్లి మల్లేశం
--01...04...2025
మద్యం మత్తులో నిరుద్యోగముతో నిర్వీర్యమై, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడి, శ్రమైక జీవన సౌందర్యానికి నోచుకోక, విలాసాలకు మరుగుతున్న యువత పెడదారి పడుతున్న సందర్భాలు సన్నివేశాలను గమనిస్తే రాబోయే కాలంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఆగడాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింసించడం, దోపిడీకి పాల్పడడంతో పాటు అనేక సందర్భాలలో నేడు యువత చేస్తున్న వికృత చేస్టలకు అంతులేకుండా పోయింది. అప్పట్లో ఒక యువకున్ని యువకులే ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా బాధి బలవంతంగా మూత్రం తాగించిన సందర్భం జ్ఞాపకం ఉండే ఉంటుంది. కర్తవ్యాలు, బాధ్యతలు, సామాజిక చింతన, శ్రమ పట్ల గౌరవం, సమాజం పట్ల విధేయత లేకుండా పెరుగుతున్నటువంటి యువత (కొంతమంది అక్కడక్కడ స్త్రీలు కూడా ) ఇలాంటి ఆగడాలకు పాల్పడుతుంటే ఇటీవల 29 మార్చ్ 2025 శనివారం రోజున నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ గ్రామంలో రాత్రి జరిగిన గ్యాంగ్ రేపు మరింత విడ్డూరంగా ఆందోళనకరంగ, జుగుప్సాకరంగా ఉండడం ఆందోళనకరం అంతేకాదు స్త్రీల పట్ల యువత తాగుడుకు లోనై తాత్కాలిక సుఖాలకు మరిగి ఎంత దుశ్చర్యలకు పాల్పడుతున్నదో తెలుస్తుంది.
ఒక స్త్రీ తన సహచరులతో ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతర లాంటి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ఒక ప్రాంతంలో సేదతీరుతున్న సందర్భంలో అక్కడకు వచ్చిన ఒక ఆగంతకుడు ఒక్కరు మాత్రమే తోడుగా ఉన్న స్త్రీని చూసి ఇదే అదనగా భావించి తన సహచర్లకు ఫోన్ చేసి అత్యాచారానికి ఉపక్రమించడం ప్రణాళిక వేయడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. మద్యం తాగ గలిగితే, చేతినిండా డబ్బులు ఉంటే తల్లిదండ్రులు సమాజము అక్క చెల్లెలు ఏ స్త్రీలు కూడా జ్ఞాపకానికి రారు కేవలం వారికి కనపడేది ఎదురుగా ఉన్న స్త్రీ తప్ప. ఒక్కడి పిలుపునందుకున్న 8 మంది మద్యం మత్తులో అప్పటికే ఊరేగుతున్న వాళ్ళు ఆ జంటతో కయ్యం పెట్టుకుని ఆమెతో ఉన్న సహచరున్ని చెట్టుకు కట్టేసి స్త్రీ పైన అత్యాచారానికి ఒకరి తర్వాత ఒకరు పాల్పడడం తెల్లవారే వరకు ఈ దుశ్చర్యలను కొనసాగించడం వాళ్ల పైశాచిక ఆనందానికి ఇదే జీవితం అని తృప్తిపడే నీచ మనస్తత్వానికి నిదర్శనం కాదా! మద్యం మత్తులో ఏదైనా చేయవచ్చు ఎంతసేపైనా చేయవచ్చు అనే దురాలోచనతో తెల్లవారే వరకు కూడా కొనసాగించి తమ ఆనందాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచించిన వారి దుర్బుద్ధికి పరాకాష్టగా డబ్బులు పంపించి మరొక్క యువకుడ్ని మద్యంతో సహా రప్పించడం వచ్చిన వాడు కూడా తన వంతు ఆనందం అనుభవించడానికి సిద్ధపడటం అంటే నేటి యువత ఎంత వికృత చేష్టలకు సిద్ధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఆ తల్లి, నిర్భాగ్యురాలైన చెల్లి అలసిపోయి సొమ్మ సిల్లి ఏడుస్తూ నిట్టూర్పుతో అచే తనురాలై వాళ్లకబంధహస్తాలకు తన శరీరాన్ని పూర్తిగా అప్పగించినా కూడా ఆమె ఆవేదన కన్నీరుని చూసి మనసు కరగలేదంటే వాళ్లు బండరాళ్లు కాక మరేంటి? ప్రేమ, అభిమానము, ఆత్మీయత, అన్యోన్యత వంటి లక్షణాలకు ఆలవాలమే కానీ ఆ దుండగులు ఒక్క క్షణం కూడా ఆమె కష్టాన్ని ఆలోచించ లేకపోయారు పైగా శారీరక మానసిక శోభకు గురై కొట్టుమిట్టాడుతున్న ఆమె" దాహం దాహం "అంటూ బ్రతిమి లాడి బ్రతకలేనంటూ బుజ్జగించినా కూడా కనికరం రాని కామాంధులు నోట్లో మూత్రం పోసి అదే మంచినీళ్లుగా తాగుమని ఓదార్చినారంటేఎంత అహంకారం! అక్కడ తాగింది పురుషుడైతే ఇక్కడ మూత్రం తాగింది స్త్రీ అక్కడ బలవంతంగా తాగిస్తే ఇక్కడ నోట్లో మూత్రం పోసింది రెండు చోట్ల కూడా మద్యం మత్తులోని యువకులే అని తల్లిదండ్రులు, సమాజము, ప్రభుత్వాలు,పోలీసు యంత్రాంగము, మానసికవేత్తలు ఈ సంఘటన పట్ల అతిగా లోతైన అన్వేషణ చేయాల్సిన అవసరo వుంది. తెల్లవార్లు హింసించి కదలలేని స్థితిలో వదిలి వెళ్లిన తర్వాత బలాన్ని కూడగట్టుకుని చెట్టు వద్దకు వెళ్లి కట్లు విప్పి సహచరుని తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయవలసి రావడం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిరంతరం ఏదో ఒక మూలన జరుగుతున్న దుష్ట సంఘటనల తీవ్రతకు అద్దం పడుతున్నది.
మూలాలు వెతకాలి... సమాజం స్పందించాలి.... ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలి:-
********
గత వారం హైదరాబాదులో నడుస్తున్న రైలులోనే ఒంటరిగా ఉన్న మహిళ పైన ఒక అదంతకుడు లైంగిక దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో కింద దూకి గాయాలపాలై చావుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి మనకు తెలుసు. కలకత్తాలో డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్, పై హత్యాచారంతోపాటు దేశవ్యాప్తంగా ఏదో ఒక మూలన నిరంతరం ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్న విషయాన్ని గమనిస్తే కొంత స్త్రీల బాధ్యత ఉండవచ్చు జాగ్రత్త ఉండడంలో కానీ ఒకరింటి చెల్లి పైన మరొకరికి అధికారం ఎక్కడిది? నీ చూపును మార్చుకోవాలి? నీ అహంకారాన్ని చంపుకోవాలి? నీ కామాన్ని కాల్చుకోవాలి? కానీ ఇతరులపై ఇలాంటి ఆగడాలకు పాల్పడితే ఎప్పుడూ తప్పించుకుంటారని అనుకోవడం మూర్ఖత్వమే. ఆసీడ్ దాడి చేయడం నరికి చంపడం పెళ్ళికి అంగీకరించలేదని హత్య చేయడం వంటి సంఘటనలు కూడా స్త్రీల పట్ల జరుగుతున్న దాడులు, వివక్షత గానే భావించవలసి ఉన్నది. మద్యం, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్ల పేరుతో ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉపాధి అవకాశాలు లేక యువత ఉంటే అనాగరిక అర్ధ నగ్న దృశ్యాలను ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వాలు కాదా?ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఉక్కు పాదం మోపి చెంప చెల్లుమనిపించే అధికారం ప్రభుత్వానికి లేదా ?కొన్నిచోట్ల ప్రణాళిక బద్ధంగా ఆదివాసీలు, పేదలు, దళితులు, గిరిజనుల పైన కావాలని ప్రత్యేకంగా ప్రణాళిక బద్ధంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరికొన్నిచోట్ల ఇట్లా కలిసి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తమ కామం తీర్చుకుంటున్న వాళ్ళ వల్ల అత్యాచారానికి గురైన వాళ్ల తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు ఆలకించాలి? ఈ దుండగులకు ఎవరు శిక్ష విధించాలి? నిర్భయ, దిశ పేరుతో చట్టాలు వచ్చినా పసి పిల్లలపైన జరిగిన అత్యాచారాలకు ఫోక్సో చట్టం, ప్రత్యేక కోర్టులు వెలసినా ఈ ఆగడాల సంఖ్య తగ్గడం లేదు. నిరంతరం రోజురోజుకు మరీ పెరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి సందర్భంలో జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు స్పందించినటువంటి యువత మహిళలు పురుషులు అధికారులు చెప్పే విషయాలు ఏమిటంటే ఆ దుండగులను ఉరితీయాలి, బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి, విషమిచ్చి చంపాలి, జనం ముందు నడి బజార్లో జరిగితే అలాంటి సంఘటనలు పునరావృతం కావు అని హెచ్చరిస్తూ రోదిస్తూ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో ఎన్కౌంటర్లు జరిగినా, ప్రజలు దాడులకు పాల్పడి హింసించినా ఈ సంఘటనలు తగ్గడం లేదనేది శాస్త్రీయమైన వాదన. ఇలాంటి సందర్భాలలో మానసికవేత్తలు, వైద్యులు నిపుణులు, సామాజికవేత్తలు ప్రభుత్వాలకు చేస్తున్న ఎన్నో సూచనలు గాలికి వదిలి వేస్తున్నారే కానీ పాలకులు వాటి పైన దృష్టి సారించిన సందర్భాలు లేవు. పని అనుభవాన్ని యువతకు అందించడం, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడడం, మధ్యము మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించడం, క్లబ్బులు పబ్బులు ఈవెంట్లతో పాటు అశ్లీల దృశ్యాలు అర్థనగ్న సన్నివేశాలు మార్కెట్ వస్తువుగా అంగడి బొమ్మగా ఆట సరుకుగా స్త్రీని చూపించే మార్కెట్ మాయాజాలాన్ని పాలకులు ఏనాడైనా అదుపు చేసినారా? ఇవి అత్యాచారాలకు కొంతవరకైనా కారణం కాదా? అక్కడక్కడ ఇలాంటి సంఘటనలకు పాల్పడిన సందర్భంలో ఆ దుండగులను చంపమని వాళ్ల తల్లిదండ్రులు స్వయంగా కోరిన సన్నివేశాలను మనం గమనించవచ్చు కానీ చట్టం ఆ పని చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేసి దశాబ్దాల తర్వాత ఆ దుండగులకు వేసిన శిక్ష ఎవరికీ తెలవకుండా పోతే ప్రయోజనం ఏమున్నది? కావలసింది మానసిక పరివర్తన..... తనను తాను ప్రక్షాళన చేసుకోవడం, కర్తవ్యాన్ని బాధ్యతను సామాజిక చింతనను గుర్తించే విధంగా సిలబస్ పాఠ్యాంశాలు బోధనలు కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాల పైన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినప్పుడు, సమాజం కూడా ఎక్కడికక్కడ స్పందించి తమ నిరసనను వ్యక్తం చేయడం, మహిళా సంఘాలు మహిళలు రచయితలు కవులు కళాకారులు వీటికి విరుగుడును తమ రచనలు ప్రదర్శనల్లో చూపగలిగి తే ఇలాంటి అభాగ్యులకు కొంతవరకైనా బాసటగా నిలిచే అవకాశం ఉంటుంది. ఎన్కౌంటర్ చేసినా మారడం లేదని అంటున్న వాళ్లు యువత పరివర్తనకు చేస్తున్న కార్యకలాపాలు, తీసుకుంటున్న చర్యలేమిటో పాలకులు చెప్పగలరా? ఉక్కు పాదం మోపడం ఎంత ముఖ్యమో మానసిక పరివర్తన తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించగలిగే మానవీయ కోణాన్ని ఆవిష్కరించడం కూడా అంతే అవసరం . ***
**"*చర్చించండి, ఆలోచించండి, ఆవేదన వ్యక్తం చేయడమే కాదు పరిష్కారాలను అన్వేషించండి, సమాజం చర్చలో భాగస్వామ్యం అయితే తప్ప ఇలాంటి సంఘటనలకు ముగింపు సాధ్యం కాదు." .******-
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట )