భారతీయుల విశ్వాస పవిత్ర గ్రంధం భారత రాజ్యాంగం
నూకల సుదర్శన్ రెడ్డి న్యాయవాదుల సంఘము సూర్యాపేట అధ్యక్షులు
మనదేశంలో పుట్టిన ప్రతి పౌరుని కి అన్ని విధాలా విద్య ఉద్యోగ, అభివృద్ధి, సంక్షేమం, సమాన హక్కులు అవకాశాలు కల్పించిన ఏకైక భారతీయుల విశశ్వాస గ్రందం భారత రాజ్యాంగం అని ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ సూర్యాపేట అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ యస్సి మహిళా డిగ్రీ కళాశాల బాలెంల లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ అధ్యక్షతన డాక్టర్ అంబేద్కర్ జయంతి జరిగింది. ముఖ్యఅతిధి గా పాల్గొన్న సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరు అంబేద్కర్ గారిని స్ఫూర్తి గా తీసుకొని మంచి చదులు చదివి జ్యానవంతులు కావాలని చెప్పినారు.ఈకార్యక్రమంలో పూర్వ ప్రభుత్వ న్యాయవాది తళ్లమల్ల హసేన్, న్యాయ సేవ సంస్థ సభ్యులు మారపాక వెంకన్న, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫన్స్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకట రత్నం, న్యాయవాది, వ్యక్తిత్వ వికాస నిపునులు కోక రంజిత్, మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.