డాక్టరేట్ పట్టా పొందిన పల్లెటూరి విద్యార్థిని అభినందించిన బండారు దత్తాత్రేయ
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెక్కెం. నివాసి పి హెచ్ డి పూర్తి చేసుకున సందర్భంగా పోతులపల్లి కమలాకర్‌కు మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ అభినందనలు.
06-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.:- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి డాక్టరేట్ పొందిన డా. పోతులపల్లి కమలాకర్‌ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అభినందించారు. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం బెక్కెం గ్రామానికి చెందిన కమలాకర్, సాధారణ గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి డాక్టరేట్ సాధించడం స్పూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ప్రొఫెసర్లు డా. బి. సురేష్ కుమార్ మరియు డా. జె. ఉపేందర్ అందించిన మార్గదర్శకత్వం కీలకమని కమలాకర్ తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సహకారం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. యువత కృషితో ముందుకు సాగి ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ గవర్నర్ ఆకాంక్షించారు.