భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉచితంగా అందించాలి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు

Jan 27, 2026 - 06:26
Jan 27, 2026 - 13:46
 0  8

తెలంగాణ వార్త సూర్యాపేట  26-01-26: భారత రాజ్యాంగ ప్రతిని ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా అందించాలని సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్, అంబేద్క రిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ డిమాండ్ చేశారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి సూర్యాపేట జిల్లా లో నిర్వహించే భారత రాజ్యాంగ రథయాత్ర జేఏసీ జిల్లా కన్వీనర్ డి విజయరామరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ బంటు కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

 కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. ప్రతి ఇంటిలో రామాయణం, భారతం, ఖురాను, బైబిల్ ఉన్న విధంగానే అన్ని మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కూడా రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ప్రపంచంలోనే గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకు వచ్చాడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకుని విద్యావంతులు కావాలని, విద్య మాత్రమే ప్రతి మనిషిని ఉన్నతుడుగా నిలబెడుతుందని వివరించారు. విజ్ఞానవంతులైన మానవులు మానవత్వంతో కలిసిమెలిసి ఉండాలని, మనిషిని మనిషిగా చూసే అంతరాల దొంతరలు లేని సమ సమాజం కోసం అందరూ కృషి చేయాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని బంటు కృష్ణ ఆకాంక్షించారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు చిప్పలపల్లి జయశంకర్, విశిష్ట అతిథులుగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టులు భూపతి రాములు, కందుకూరి యాదగిరి, సుంకరబోయిన వెంకటయ్య, రాము తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ డా.విశారదన్ మహారాజ్ ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లాలో యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు తప్పకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందించాలని కోరారు. రాజ్యాంగ విలువలను మసకబారే లా చేసే ఏ చర్యనైనా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలన్నారు. ,స్వాతంత్ర్యం వేరు - గణతంత్రం వేరు, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి, రాజ్యాంగం ప్రతి ఇంటిలో ఉండాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట నాయకులు సూరపల్లి సైదులు, జిల్లా నాయకులు అల్వాల ఉపేందర్ ముదిరాజ్, వంశీ,రజక, శివ కుమార్ యాదవ్, కొండమీద శ్రీనివాస్, రమేష్, భాస్కర్, పేరాల శ్రీనివాస్, ఔరేండ్ల నాగేంద్రబాబు, రాము, అంబెడ్కర్ ఎస్ విష్ణు, డీఎస్ యు విద్యార్థి నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సైదులు, సతీష్, అజీజ్, జహీర్, మోహిన్, గౌసుద్దీన్, చాంద్, వెంకట్, ఆనంద్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136