భక్తులతో కిటకిటలాడిన శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం.
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్తా ప్రతినిధి:- ఆది శిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈ వో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం అమావాస్య చివరి రోజు సందర్భంగా పలువురు భక్తులు పలు ప్రాంతాల నుండి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు గద్వాల కాకతీయ టెక్నో స్కూల్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రి భక్తులకు శాంతినగర్ శివ శివాని హై స్కూల్ వారిచే అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాముడు, నరేందర్ అశోక్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.