జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
భారీ వర్షాలతో పొంచి ఉన్న ప్రమాదాలు

మండల అధ్యక్షులు: చిల్ల నిరంజన్ ముదిరాజ్
తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 మహబూబాద్ జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రమాదాలు పొంచి ఉన్నందున జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని దంతాలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ అన్నారు. గతంలో తెలంగాణాలో ఇద్దరు, ఆంధ్రాలో ఒకరు వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మన అందరికి గుర్తు ఉందనుకుంటున్నాన్నారు మన కుటుంబాలను యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అది గుర్తుంచుకుని న్యూస్ కవరేజి కోసం, బ్రేకింగ్ న్యూస్ ల కోసం అత్యుత్సాహంతొ వెళ్ళవద్దు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు.