బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

తిరుమలగిరి 17 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దంతాలపల్లి మండలం రేపోని గ్రామానికి చెందిన కాగితం రమేష్ (45) హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా తొండ గ్రామ శివారు వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడ మృతి చెందాడు మృతుడి కుమారుడు ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.....