బుర్రకథ కళాకారుడు మృతి ....గ్రామంలో తీవ్ర విషాదం

May 26, 2026 - 13:59
 0  325
బుర్రకథ కళాకారుడు మృతి ....గ్రామంలో తీవ్ర విషాదం

  మూగబోయిన బుర్రకథ కళాకారుని గొంతుక .........

ఆయనే ఒక కళాకారుడు ......ఒక గాయకుడు..... వ్యవసాయదారుడు......

  ఒక డాక్టర్ చిన్నపిల్లలకు వృద్ధులకు కీసర మందు....పట్టు మాత్రం.....

ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలందించిన ఘనత... 

ఇలా అనేక సేవలు చేసిన గొప్ప వ్యక్తి జోగు సోమ నరసయ్య..

తిరుమలగిరి 26 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

బుర్రకథ ,ఒగ్గు కథ ,చెక్కతీగల, తోలుబొమ్మలాట కళాకారుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన జోగు సోమనర్సయ్య (85) వడ దెబ్బతో మంగళవారం మృతి చెందాడు... అంతరించి పోతున్న కళారూపాలకు జీవం పోస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పలు ప్రదర్శనలతో చెక్క బొమ్మలాటకు విశేష ప్రాచుర్యం కల్పించారు. చెక తీగల తోలుబొమ్మలాట ద్వారా శతాబ్దాల నాటి కథా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి అంకితమైన కళాకారుల బృందానికి నాయకత్వం వహించాడు. ఆయన ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, సత్యహరిచంద్ర, రామదాసు కథలకు ప్రాణం పోశాయి. జోగు సోమ నరసయ్య ఆకస్మిక మృతి కళకు తీరని లోటని తొండ గ్రామం ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు...

 అందరిని అల్లరించిన కళాకారుడు..జోగు సోమనర్సయ్య

 కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు ఒగ్గు కథకు ప్రాణం పోసిన వ్యక్తి ఆయన తన కళ ప్రదర్శనలతో ఈ ప్రాంతంలో గొప్ప గుర్తింపు పొందారు కథలు చెప్పడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉండేది తన గాత్రం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవారు ఆయన కళా ప్రదర్శనలు పల్లెల్లో సంస్కృత వైభవాన్ని చాటిచెప్పాయి అనేక ప్రదర్శనాలలో పాల్గొని యువ కళాకారులకు పూర్తిగా నిలిచాడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు ఆయన మృతి తెలంగాణ జానపద కళా రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి