తిరుమలగిరిలో సైక్లింగ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

May 26, 2026 - 14:47
 0  325
తిరుమలగిరిలో సైక్లింగ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

తిరుమలగిరి 26 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్నేహ సంఘాల బాలికలకు ఉచితంగా సైక్లింగ్ నేర్పించే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్నేహ సంఘాల బాలికలకు సాధికారత కల్పించే ప్రభుత్వ పథకం. ఇది 18 సంవత్సరాల లోపు వయస్సు గల కిశోర బాలికల ఆరోగ్యం, పోషణ మరియు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడుతుందని అలాగే స్నేహ సంఘాల బాలికలు ప్రతి ఒకరు సాద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరి ప్రసాద్ ఎండిఓ బి లాజర్ ఏపిఎం లక్ష్మి ఎమ్మెస్ అధ్యక్షాలు సమైక్య సిబ్బంది స్నేహ సంఘాల బాలికలు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి