బీచుపల్లి కృష్ణా నదిలో దూకిన యువతికి ప్రాణదానం
గజ ఈతగాళ్లు, ఇటిక్యాల ఎస్సై రవి చొరవతో సురక్షితంగా బయటకు...
జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి మండలం. బీచుపల్లి కృష్ణా నదిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన యువతి కృష్ణా నదిలో దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక గజ ఈతగాళ్లు వెంటనే నదిలోకి దిగి యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఇటిక్యాల ఎస్సై రవి సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు సాహసోపేతంగా నదిలో గాలించి యువతిని గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆమెకు ధైర్యం చెప్పారు. సకాలంలో స్పందించిన గజ ఈతగాళ్లు, ఇటిక్యాల ఎస్సై రవిని స్థానికులు అభినందించారు... ఎవరికైనా కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే ఆత్మహత్యకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు.