బిజెపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Jun 2, 2026 - 19:42
 0  0
బిజెపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

డి కే బంగ్లాలో  జాతీయ జెండా ను  ఆవిష్కరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు.

 జోగులాంబ గద్వాల 2జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గద్వాల్ జిల్లా కేంద్రంలోని  బిజెపి కార్యాలయంలో జాతీయ జెండా ను బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరవీరులున్నారని, వారి త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం అని కొనియాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించి బీజేపీ చేసిన కృషిని బీజేపీ నాయకులు గుర్తు చేసుకున్నారు. అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రతి యువకుడికి అవకాశాలు లభించాలి. వికసిత తెలంగాణ నిర్మాణంలో మనమంతా భాగస్వామ్యం కావాలని వారు అన్నారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్ ,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహులు, జిల్లాఓబీసీ నాయకులు దాస్,కౌన్సిలర్ చంద్ర శేఖర్, బిజెపి సీనియర్ నాయకులు అనిల్ మోహన్,నర్సింహశెట్టి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, మరియు పట్టణ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333