తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం

Aug 5, 2026 - 22:21
Aug 5, 2026 - 23:19
 0  3
తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం

 తిరుమలగిరి 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, తల్లి పాల వల్ల శిశువుకు లభించే పోషకాలు, రోగనిరోధక శక్తి, పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ్ ఏఎన్ఎం వెంకటమ్మ, ఆశా వర్కర్లు శోభ, పూలమ్మ, అంగన్వాడీ టీచర్లు సురక్షిత, వీరమ్మ, ఎల్లమ్మ, అంగన్వాడీ ఆయాలు మరియు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి