అఖిలపక్ష కమిటీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐజకు ఫైర్ స్టేషన్ మంజూరు కొరకు కలెక్టర్కు వినతి
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల అఖిలపక్ష కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐజకు ఫైర్ స్టేషన్ మంజూరు కొరకు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
_____కలెక్టర్ సానుకూల స్పందన
జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం 5 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ నష్టానికి దారితీసింది. అయితే ఇలాంటి సంఘటనలు ఐజ మండలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా అగ్ని ప్రమాదాలు జరిగాయి. కానీ ఆస్తి నష్టం జరగకుండా కాపాడలేకపోయాం. దీనికి కారణం ఐజ పట్టణంలో ఫైర్ స్టేషన్ లేకపోవడమే.
ఈ ఫైర్ స్టేషన్ కోరిక లేక డిమాండ్ ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరంల దగ్గర నుంచి ఐజ మండలంలోని ప్రజా సంఘాలు, అఖిలపక్ష కమిటీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కుల సంఘాలు ఆవేదనతో కూడిన అభ్యర్థనలు ముఖాముఖి, వ్రాతపూర్వకంగా చాలా సార్లు కలెక్టర్ కి స్థానిక పాలకులకు తెలిపారు. ఐజ మండలం గద్వాల తాలూకాలో ఉన్నప్పటి నుండి ఐజ మండలము అలంపూర్ నియోజకవర్గంలో కలిసి ఎస్సి నియోజకవర్గం అయిన దగ్గర నుండి కూడా ప్రజలు ఈ డిమాండ్ ని కోరుతూనే ఉన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు తప్పకుండా ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకున్నారే తప్ప నేటి వరకు వాటిని అమలుపరిచే విషయంలో వెనుకబాటు ఉందని మేము ఆవేదన పడుతున్నాం. ఐజ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఉండడం వల్ల ఐజ మండలమే కాక చుట్టూ ఉన్న మండలాలు మల్దకల్, గట్టు, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు అనువుగా ఉంటుందని అధికారులు గుర్తించాలని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రజా సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అఖిలపక్ష కమిటీ నాయకులు వివిధ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.