బస్ డిపో నిర్మాణం చేపట్టాలి
తిరుమలగిరిలో తక్షణమే బస్ డిపో నిర్మాణం చేపట్టాలి. అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం
ఆర్టీసీకి ఆదాయం పెరగాలి
తిరుమలగిరి అభివృద్ధి చెందుతుంది
తిరుమలగిరి 01 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్.
తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం తక్షణమే చేపట్టాలి ఈరోజు తిరుమలగిరి లో అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం వక్తలు తీర్మానం చేయడం జరిగింది. బుధవారం గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అనంతరం కడెం లింగయ్య మిగతా హాజరైన వక్తలు మాట్లాడుతూ,తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా దినదినం అభివృద్ధి చెందుతూ వివిధ మండలాలు జిల్లాల నుండి రోజుకు కొన్ని వేల మంది తిరుమలగిరి సెంటర్కు ప్రయాణం చేస్తా ఉంటారు బస్ డిపో నిర్మాణం లేక బస్సులో వస్తున్నటువంటి ప్రయాణికులకు సరైన సౌకర్యాలు లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు తిరుమలగిరి సెంటర్లో బస్ డిపో నిర్మాణం జరిగినట్లయితే కొన్ని వేల మంది ప్రయాణికులకు వసతులు తోపాటు ఆర్టీసీ వాళ్లకు ఆదాయం కూడా పెరుగుతున్నది ముఖ్యంగా ఆర్టీసీ వాళ్లకు ఆదాయం పెరగాలంటే తిరుమలగిరి సెంటర్లో బస్ డిపో నిర్మాణం చేయాలి తిరుమలగిరి సెంటర్ సూర్యాపేట 45 కిలోమీటర్లు జనగామ 45 కిలోమీటర్లు తొర్రూరు 30 కిలోమీటర్లు మోతుకూరు 30 కిలోమీటర్లు ఈ ప్రాంతాలన్నీ ఈ ప్రాంత ప్రయాణికులకు కలగాలంటే తిరుమలగిరి సెంటర్ తిరుమలగిరి ప్రయాణికులకు కేంద్రానికి నిలయం అందుకని తిరుమలగిరి సెంటర్లో బస్ డిపో నిర్మాణం జరగాలి ఆర్టీసీకి ఆదాయం పెరగాలి తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారులు ఇక్కడున్న ఆర్టీసీ ఆదాయానికి వెసులుబాటుగా తిరుమలగిరి ప్రాంతం అనుకూలమైన వాతావరణంలో ఉన్నది అందుకని ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తిరుమలగిరిలో బల్డిపో ఏర్పాటు చేయాలని ఇది ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు దీన్ని స్థానిక ఎమ్మెల్యే తుంగతుర్తి శాసనసభ్యులు సామేలు దయచేసి తిరుమలగిరికి డిపో నిర్మాణం కోసం సమ్మతిత అధికారులతో మాట్లాడి ఒప్పించవలసినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పై ఉన్నది తిరుమలగిరి పరిసర ప్రాంత ప్రజలంతా ఆదివారం నాలుగో తారీఖు ఎనిమిదో నెల ఉదయం 9 గంటలకు తిరుమలగిరి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు బస్టాండు నిర్మాణం పై అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాసంఘాలు మరియు కులాసంఘాలకు అతీతంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మమేకమై బస్టాండ్ నిర్మాణం కోసం ఆదివారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని తిరుమలగిరి హైస్కూల్ నందు రాగలరని మనవి చేయుచున్నాము. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మూల అశోక రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కందుకూరి సోమయ్య, వేల్పుల లింగయ్య యాదవ్, కందుకూరి ప్రవీణ్, కొండ సోమయ్య, మూల రవీందర్ రెడ్డి, దీన్ దయాలు, నలుగురి రమేష్, పోరెల్ల లక్ష్మయ్య ,అనంతుల శీను తిరుమలగిరి గ్రామ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.