ఒంటరి పోరాటం చేస్తున్న యువ జర్నలిస్ట్
ఒంటరి పోరాటం చేస్తున్న యువ జర్నలిస్ట్ పెరుమాళ్ళ సురేష్
సుభాష్ చంద్రబోస్ భావజాలంతో ముందుకు వెళుతున్న జర్నలిస్ట్
తిరుమలగిరి 06 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ అభ్యర్థిగా తన ఒంటరి పోరాటానికి కుటుంబంతో కలిసి ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తున్న పెరుమాళ్ళ సురేష్ ఈ సందర్భంగా ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ అభ్యర్థి సురేష్ మాట్లాడుతూ మూడో వార్డులో పేరుకుపోయిన సమస్యలను గెలిచిన వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చారు పేరుకే మున్సిపాలిటీ కానీ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది నేను గెలిచిన వెంటనే డ్రైనేజీ మరియు సిసి రోడ్లు విద్యుత్ దీపాలు ప్రతి ఒక్క సమస్యను నా సమస్యగా తీరుస్తానని ప్రజలకూ హామీలు ఇచ్చారు నేను గెలిచిన వెంటనే ఆరు నెలలలో ఏ పని కాకపోయినా నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు