బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేష సూర్యాపేట  జిల్లా అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతoగి వీరస్వామి గౌడ్

Apr 5, 2024 - 15:28
Apr 5, 2024 - 18:55
 0  116
బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్
బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్

సూర్యాపేట టౌన్, 05 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్  అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ కొత్త బస్టాండ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 116 వ ,జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహా మేధావి అని గుర్తు చేశారు.  పార్లమెంటు సభ్యుడిగా,   కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు విశేషమైన సేవలందించిన గొప్ప రాజకీయ వేత్త అని కొనియాడారు.

 అస్పృశ్యత, అంటరానితనం కు వ్యతిరేకంగా కుల రహిత సమాజం కోసం బడుగుల పక్షాన పోరాడిన  సామాజిక వేత్త అని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అలాంటి మహనీయుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

 ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవసలహా దారులు  దేవత కిషన్ నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మ గానీ శ్రీనివాస్ గౌడ్,  జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారులు మాది రెడ్డి గోపాల్ రెడ్డి, నాయకులు ఆకుల మారయ్యా,ఖమ్మం పాటి అంజయ్య, రాపర్తి సురేష్ గౌడ్, ఐ తగానీ మల్లయ్య, బొమ్మ గానీ వెంకన్న గౌడ్, పెగ్గే పురం నర్సయ్య,సరగoడ్ల కొటేష్,జలగం లోకేష్,పందిరి మల్లేష్ గౌడ్, ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ రాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పంతoగి దశరథ,బానోతు జానీ నాయక్,కొత్త పెళ్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333