బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి

తిరుమలగిరి 29 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి ఆదేశానుసారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి సమీపంలోని పద్మశాలి కాలనీ నందు బడి ఈడు పిల్లలని ఎంపీపీ ఎస్ తిరుమలగిరి నందు చేర్పించాలని తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. 20మంది విద్యార్థినీ విద్యార్థులని నూతనంగా నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. అశోక్ రెడ్డి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కవిత , సత్యనారాయణ రెడ్డి , వెంకట్రామనర్సయ్య , సౌమ్యబాయి గిరి లు పాల్గొన్నారు.