POCSO బాధితురాలి వయసు మైనర్ అని తేల్చిన పోలీసులు
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు ఆమె ధృవీకరణ పత్రం సమర్పించగా దాని ఆధారంగా ఆ సంవత్సరంలో GHMC రికార్డులను పరిశీలించగా వాస్తవమే అని తేల్చిన పోలీసులు
ఇది ఇలా ఉండగా...
బండి సంజయ్ కొడుకు మైనర్ బాలిక POCSO కేసులో చిన్నారి వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదు...
POCSO చట్టం కింద నమోదైన FIR No. 684/2026 లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, FIR No. 706/2026, U/s. 74 of the Juvenile Justice Act, Sec. 72(1) of BNS and Sec. 23 of the POCSO Act కింద కేసు నమోదు చేయబడింది.
అదేవిధంగా, ఈ విధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించి, ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపించబడినవి. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయబడ్డాయి.
ప్రజలకు మరియు సోషల్ మీడియా నిర్వాహకులకు విజ్ఞప్తి..
POCSO కేసుల్లో బాధిత బాలిక, చిన్నారి యొక్క వ్యక్తిగత వివరాలు లేదా తల్లి దండ్రులు వివరాలు బహిర్గతం చేయడం వల్ల బాధితురాలికి మరియు ఆమె తల్లి దండ్రులు కి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇది చట్ట ఉల్లంఘన కూడా. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
Sd/-
Station House Officer,
P.S. Pet-Basheerabad,
Cyberabad.