ప్రముఖ శాస్త్రవేత్త రక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన గడ్డమనుగు చంద్రమౌళి గారికి పద్మశ్రీ సత్కారం లభించడం పట్ల శుభాకాంక్షలు తెలియజేసిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం

Jun 25, 2026 - 19:54
 0  4
ప్రముఖ శాస్త్రవేత్త రక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన గడ్డమనుగు చంద్రమౌళి గారికి పద్మశ్రీ సత్కారం లభించడం పట్ల శుభాకాంక్షలు తెలియజేసిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం

 తెలంగాణ వార్త జూన్ 25 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం: భారతరక్షణ రంగంలో రంగంలో విశిష్ట సేవలందించినగడ్డమనుగు చంద్రమౌళి 
ప్రముఖ శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన ఆయన, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO)లో అనేక సంవత్సరాలు సేవలందించారు. ముఖ్యంగా భారతదేశ ప్రతిష్ఠాత్మక ఆకాశ్ క్షిపణి (Akash Missile) రూపకల్పన మరియు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన పరిశోధనలు దేశ రక్షణ సామర్థ్యాల పెంపుదలకు విశేషంగా దోహదపడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించ డం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గడ్డం మణుగు చంద్రమౌళి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల. రవికుమార్ తెలిపారు. నిరంతర శ్రమ, అంకితభావం మరియు దేశభక్తికి గడ్డమనుగు చంద్రమౌళి గారు ఆదర్శప్రాయ వ్యక్తిత్వంగా నిలిచార ని యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. భారత రక్షణ రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమైన వని, నేటియువత చంద్రమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో పాల్గొనాలని ప్రజలు కోరుతున్నారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333