ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు

ఎంపిక పూర్తి: జిల్లా అదనపు కలెక్టర్  

May 20, 2024 - 20:58
May 22, 2024 - 15:10
 0  17
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు

జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసేందుకు వివిధ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ (స్థానిక సంస్థలు) తెలిపారు. సోమవారం గద్వాలలోని పాత ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశాల మేరకు అధికారులు అభ్యర్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు.  ఔట్ సోర్సింగ్ విధానంలో ఎంపిక చేసేందుకు మొత్తం 24 పోస్టులకు గాను 2,370 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.

  ఇందులో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 11 ఉండగా 672 మంది, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 9 కి గాను 1483 మంది, మూడు ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు 201 మంది, ఒక థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 14 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో లాటరీ  తీయగా థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు ఉషారాణి ఎంపికైంది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు భవాని, సమ్రిన్ బేగం, ఎండి సమీర్ ఎంపికయ్యారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సులోచన రాణి, పూజిత, జయలక్ష్మి, హారిక, లక్ష్మి, శేఖర్ రెడ్డి, సువర్ణ, యశోద, ప్రసాదరావు, శైలజ, భాస్కర్ ఎంపికయ్యారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అనిత, సుందర్ రాజు, కళావతి, మంజుల, సుమలత, అన్వర్ భాష, పుష్పలత, ఉమలత, రేపల్లె జనార్ధన్ ఎంపికయ్యారు. ఈకార్యక్రమంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారిని ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333