ప్రభుత్వ భూమిలో అక్రమ ఇళ్ల నంబర్లు

Jun 24, 2026 - 19:52
 0  13
ప్రభుత్వ భూమిలో అక్రమ ఇళ్ల నంబర్లు

మున్సిపల్ కమిషనర్‌కు మేరిగ సాయి ఫిర్యాదు..!

హుజూర్ నగర్ మున్సిపాలిటీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1041లో గల ప్రభుత్వ భూమిలో ఎటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ మేరిగ సాయి బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్వే నంబర్ 1041లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని అక్రమంగా ఇంటి నంబర్లు పొందినట్లు పేర్కొన్నారు. చెన్నగాని నాగమణి (భర్త సైదులు) పేరుతో 20-139/2 ఇంటి నంబరు, 118100 7897 అసెస్‌మెంట్ నంబరుతో, అలాగే వెలిదండ వీరారెడ్డి (తండ్రి రంగారెడ్డి) పేరుతో ఇదే ఇంటి నంబరు (20-139/2) మరియు అదే అసెస్‌మెంట్ నంబరు (118100 7897)తో అక్రమంగా దరఖాస్తు చేసుకుని ఇంటి నంబర్లు పొందారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి యాజమాన్య హక్కులు లేని భూమికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు ఎలా కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే సదరు ఇంటి నంబర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమగాని రవీందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333