ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల పై అవగాహన సదస్సు ఏఎస్ఐ ఈశ్వరయ్య
జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలను వదలాలి మత్తు పదార్థాలు వాడడం వల్ల అవగాహన సదస్సు నిర్వహించిన మల్దకల్ ఏ ఎస్ ఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది .మత్తు పదార్థాలు వాడడం వల్ల ఆరోగ్యాలు పాడవ్వడమే కాకుండా చాలా మటుకు కుటుంబ కలహాలు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు .ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలను వాడకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ నరసింహులు అధ్యాపకులు రామాంజనేయులు గౌడ్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ శేఖర్ హెడ్ కానిస్టేబుల్ పూజయా కానిస్టేబుల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.