పెనియేలు సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షులు జె జె శ్యామ్యూల్
మునగాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ క్రైస్తవ సంస్థ పెనుయేలు వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు పాస్టర్ జె జె సామ్యూల్ సన్ ఇద్దరు దివ్యాంగులకు శనివారం ట్రైసైకిళ్లు అందజేశారు. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన మోటం లక్ష్మమ్మ, కళ్లెం లచ్చమ్మలు అనే దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా పెనుయేలు సంస్థ అధ్యక్షుడు సామ్యూల్ సన్ మాట్లాడుతూ, పెనుగలు సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా అనేకమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహించి చేదోడు వాదోడుగా ఉండేందుకు పెనుయేలు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వెలిదండ గ్రామంలోని ప్రజలు, సంఘస్తులు పెనుయేలు సంస్థ అధ్యక్షుడు సామ్యూల్ సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్లెం ఏలీయా, సుధాకర్, లూకా, రాజు, సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు.