పాఠశాల పున ప్రారంభం రోజున పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ...

Jun 12, 2024 - 16:43
Jun 12, 2024 - 19:53
 0  7
పాఠశాల పున ప్రారంభం రోజున పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ...
పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేస్తున్న కలెక్టర్ వెంకట్రావు

*పాఠశాలల పున:ప్రారంభ రోజున పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ*..

రాష్ట్రంలోనే మొదటగా ఏకరూప దుస్తుల తయారీ చేసిన సూర్యాపేట జిల్లా,

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం,

విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేల ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

మునగాల  11 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- పాఠశాలలు ప్రారంభించిన రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పుస్తకాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు బుధవారం సూర్యాపేట జిల్లాలోని మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట లో బాగంగా ఏర్పాటుచేసిన ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రభుత్వం పాఠశాలలో అన్ని వసతులను కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య ఉండే విధంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా పాఠశాల ప్రవేశద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో విద్యార్థులకు కలెక్టర్ పుష్పాలని ఇచ్చి సుస్వాగతం పలికారు.

  అమ్మ ఆదర్శ పాఠశాల భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 536 పాఠశాల గాను 300 పాఠశాలలో పనులు పూర్తయినవని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కోడ్ ఉన్నందున ఇంకా 236 పాఠశాలలో పనులు పూర్తి కాలేదని వారంలోగా పనులు పూర్తి చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య బోధన అందించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మంచి ఆశయంతో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందిస్తున్నారని స్వయం సహాయక సంఘాల ద్వారా ఏకరూప దుస్తులు తయారు చేయడం జరిగిందని, రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా ఇచ్చిన లక్ష్యాన్ని మొదటగా పూర్తి చేసిందని కలెక్టర్ స్వయం సహాయ సంఘాలకు

ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా జిల్లాలో 53,458 జతల ఏకరూప దుస్తులు తయారు చేయడం జరిగిందని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దుస్తుల కటింగ్ మిషన్లు కూడా అందజేయడం జరిగిందని, స్వయం సహాయక సంఘాలు బలపడితే వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుపడతాయని ప్రభుత్వం సంఘాలకు దుస్తుల తయారీ అందజేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న దుస్తులను చూసి రెడీమేడ్, ప్రైవేట్ సంస్థలు ఆశ్చర్యపోతున్నాయని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చదువు విషయంలో వినూత్నమైన మార్పులు తీసుకుని వస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో, మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష , యంపిపి బిందు రెడ్డి, ZPTC జ్యోతి, MEO సలీం షారుక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారామరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి. ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State