ఫీల్డ్ వేరిఫికేషన్ పకడ్బందీగా  చేపట్టాలి::జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Jan 17, 2025 - 20:35
Jan 17, 2025 - 20:36
 0  8
ఫీల్డ్ వేరిఫికేషన్ పకడ్బందీగా  చేపట్టాలి::జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
ఫీల్డ్ వేరిఫికేషన్ పకడ్బందీగా  చేపట్టాలి::జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, శుక్రవారం.18:- రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు  సంబంధించిన సర్వే జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం ఐ.డి.ఓ.సి లోని ప్రధాన సమావేశ మందిరంలో స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి జిల్లా అధికారులతో కలిసి జిల్లాలో నాలుగు పథకాలపై జరుగుతున్న ఫీల్డ్ సర్వే పై  సమీక్ష సమావేశం నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26నుంచి నాలుగు స్కీంలు అమలు చేయనున్న దృష్ట్యా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం..పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామసభల నిర్వహణ, అర్హుల జాబితా ఆమోదం లాంటి పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలన్నారు. ఈనెల 16 నుంచి 20 వరకు గ్రామాల్లో నంబరు వారీగా సర్వే చేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తించాలని అన్నారు. సర్వే నిర్వహణలో   ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసి సర్వే నిర్వహణలో అలసత్వం చేయరాదన్నారు.భూమిలేని వ్యవసాయ కూలీలు గుర్తించి, రేషన్ కార్డులు మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పారదర్శకంగా పాటించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు సర్వే కు సంబంధించిన రిపోర్ట్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్.డి.ఓ కృష్ణవేణి, జడ్పీ సీఈవో పురుషోత్తం, డి.ఆర్.డి.ఏ మధుసూదన రాజు, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, డి.పి.ఓ హరిప్రసాద్, డి.ఏ.ఓ వసంత, ఏ.డి.సర్వే ల్యాండ్ అధికారి నరసింహస్వామి, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్,డి.ఎస్.ఓ ప్రేమ కుమార్, డి.ఎం.కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333