ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్దికి ఉచితంగా యూనిఫామ్ అందజేత..

May 18, 2024 - 22:12
 0  10
ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్దికి ఉచితంగా యూనిఫామ్ అందజేత..

గోపాలపురం కుట్టు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..

జూన్ 5 నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క జత అందజేయుటకు చర్యలు...

53, 234 మంది విద్యార్థులకు రెండు జతలు....

జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అందజేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు .
 శనివారం సూర్యాపేట జమ్మిగడ్డ లో గల గోపాలపురం కుట్టు  కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.

జూన్ 5వ తేదీ కల్లా ప్రతి విద్యార్థికి ఒక జత అందజేస్తున్నట్లు కలెక్టర్ కలెక్టర్ పేర్కొన్నారు.

ఇక్కడ 2255 మంది పిల్లలకు యూనిఫార్మ్ కుట్టి అందజేయనున్నట్లు ఏపీ డి రామ్ సురేష్ కలెక్టర్కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ఏర్పాటు చేసింది అలాగే ఎస్ హెచ్ జి మహిళల ద్వారా నే స్కూల్ యూనిఫామ్స్ కుట్టించి ప్రభుత్వ పాఠశాలలకు సప్లై  చేయడం జరుగుతుందని, దీనివల్ల మహిళలు అర్దికంగా అభివృద్ధి చెందుతారని ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా స్వయం శక్తి ద్వారా పిల్లల యొక్క యూనిఫార్మ్స్ ను కుట్టించడం జరుగుతుందని దీనివల్ల మహిళలు ఉపాధి కొరకు బయటకు వెళ్లే అవసరం లేకుండా మంచి అవకాశం ప్రభుత్వం కల్పించిందని అందరూ సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన మెటీరియల్ వాడుతూ యూనిఫామ్ కుట్టాలని కలెక్టర్ తెలిపారు. కేంద్రంలో యూనిఫార్మ్స్ కుడుతున్న ఫాజియా ,అన్నపూర్ణ లో కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవకాశం ప్రభుత్వం కల్పించడం వలన ఎంత ఉపాధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 53,234 విద్యార్థులకు జూన్ 12 నాటికి రెండు జతలు  యూనిఫార్మ్స్ 1, 0 6, 4 6 8 యూనిఫార్మ్స్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు,  అడిషనల్ డిఆర్డిఓ సురేష్,డిపిఎం ఆంజనేయులు, ఏపీఎం వెంకయ్య, సీసీలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

-----------Dpro..........srpt------------

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333