ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ.
జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఫిర్యాదు దారులు నిర్భయంగా తమ సమస్యలను పోలీస్ స్టేషన్ లలో తెలియజేస్తే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించి పోలీస్ అధికారులు చట్ట ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 05 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ జిల్లా ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులలో భూమి తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకొనగా ఇప్పుడు డబ్బులు తీసుకొని తమ భూమిని తమకు ఇవ్వమంటే ఇవ్వడం లేదని -01 ఫిర్యాదు. గురుకులం లో సీటు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని సీటు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని -01 ఫిర్యాదు. భూమిని సర్వే చేసేందుకు ప్రభుత్వ సర్వేయర్ ను తీసుకెళ్తే ప్రక్క భూమి వారు సర్వే ను అడ్డుకుంటున్నారు అని -01 ఫిర్యాదు. ఇతర అంశాలకు సంబంధించి -02 వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పిర్యాదు దారులు తమ సమస్యలను స్వేచ్ఛగా,నిర్భయంగా పోలీస్ స్టేషన్ లలో తెలియజేయాలని వచ్చిన ఫిర్యాదుల పై అధికారులు వాస్తవాలను తెలుసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.