పోరాటాలతోనే కార్మికుల హక్కులకు రక్షణ

May 1, 2026 - 18:08
 0  0
పోరాటాలతోనే కార్మికుల హక్కులకు రక్షణ

మేడే స్పూర్తి తో కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి....
కార్మికుల పోరాటాలకు యూటీఎఫ్ మద్దత్తు...

కోదాడ 1మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కోదాడ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో మేడే వేడుకలు...
పోరాటాలతోనే కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీని వాస్ రెడ్డి జిల్లా కార్యదర్శులు  ఎన్ నాగేశ్వరరావు, పాండు రంగా చారి లు అన్నారు. శుక్రవారం కోదాడ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వేడుకలు నిర్వహించి మాట్లాడారు. కార్మికులు తమ రక్తం చిందించి 8గంటల పని దినం సాధించుకున్న రోజు మేడే అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పాలక వర్గాలు నిర్వర్యం చేస్తున్నాయన్నారు. కార్మికుల పోరాటాలకు యూటీఎఫ్ మద్దత్తు వుంటుందన్నారు.ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు భావ సింగ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ కమిటీ సభ్యులు టి.ఏ జనార్ధన్, సీనియర్ నాయకులు చందా శ్రీనివాసరావు, డర్ర ఉపేందర్, పిడతల శ్రీనివాస్, హమీద్, డివిజన్ లోని అన్ని మండలాల బాధ్యులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333