సెప్టెంబర్ 12 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
రాజీ మార్గమే.. రాజ మార్గం! ... జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., .
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు.
రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చు క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే... రాజమార్గం! కావున సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., తెలిపారు.
సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్- అదాలత్ ను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ.... క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడుటకు జాతీయ లోక్ - అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రాజీ పడదగిన కేసులు:
???? క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,
???? సివిల్ తగాదా కేసులు,
???? ఆస్తి విభజన కేసులు,
???? కుటుంబపరమైన కేసులు,
???? వైవాహిక జీవితం సంబంధిత కేసులు,
???? బ్యాంకు రికవరీ,
???? విద్యుత్ చౌర్యం,
???? చెక్ బౌన్స్ కేసులు
పై కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీకి అవకాశం ఉంటుంది అన్నారు.
కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని తెలిపారు.
..