నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి.. దోసపహాడ్ ప్రాజెక్టు పునరుద్ధరణకు కసరత్తు
మిషన్ భగీరథ సరఫరాలో లోపాలపై సమీక్ష....ట్యాంకర్లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట,
సూర్యాపేట కొత్త మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం,
60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు అనుసంధాన రహదారిపై కీలక నిర్ణయం...మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి.
సూర్యాపేట...
సూర్యాపేట పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు.మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ విద్యుత్ అంతరాయం, మోటార్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీల కారణంగా అప్పుడప్పుడు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. భవిష్యత్‌లో నీటి సమస్య తలెత్తకుండా గతంలో వినియోగంలో ఉన్న దోసపహాడ్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.మిషన్ భగీరథ అధికారులతో ఇప్పటికే ఫీల్డ్ విజిట్ నిర్వహించి పట్టణంలో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను గుర్తించినట్లు నివేదిత లక్షాధి తెలిపారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 9 నుంచి 10 వాటర్ ట్యాంకులను నింపి పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పాలకవర్గం ముందుకు వచ్చిందని, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చైర్పర్సన్ అన్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ స్థాయిలో నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే పాలకవర్గం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై మూసీ అధికారులతో మాట్లాడి సద్దుల చెరువును నింపినట్లు చెప్పారు. చెరువులో నీరు చేరడంతో చుట్టుపక్కల వార్డుల్లోని బోర్లకు కొంతమేర నీరు సమకూరుతున్నదని వివరించారు.
మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎండీ షఫీ ఉల్లా మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉందన్నారు. తాగునీటి సరఫరా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు మాట్లాడుతూ జాతీయ రహదారి–65 కింద ఉన్న 60 అడుగుల రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గానికి కనెక్టివిటీ కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
తెరాస ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి సరఫరా సమస్యపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. తమ వార్డులకు నీటి సరఫరా కోసం ట్యాంకర్ పంపించాలని అధికారులకు, సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన కమిషనర్ హన్మంత రెడ్డి పాలకమండలి సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తెలిపే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బి.ఆర్.యస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ వార్డుల్లో ఎన్నికల్లో ఓడిపోయిన కౌన్సిలర్లు పెత్తనం చేస్తున్నారని, అలాంటి జోక్యాన్ని అడ్డుకోవాలని కోరారు. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లకే వార్డుల సమస్యల పరిష్కారంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సభలో పేర్కొన్నారు.18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ వి. రామమూర్తి, 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి దిలీప్‌రెడ్డి లు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, తాగునీటి సరఫరా విషయంలో సూర్యాపేట ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. సుందరయ్యనగర్‌లో లీకేజీ సమస్యను పరిష్కరించాలని మూడు నెలలుగా అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని దిలీప్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని కోరారు.38వ వార్డు కౌన్స…