44వ వార్డులో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం
స్వయంగా కాలువలు శుభ్రం చేసిన కౌన్సిలర్ గుణగంటి హేమా సతీష్.
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 44వ వార్డులో కౌన్సిలర్ గునుగంటి హేమా సతీష్ పర్యవేక్షణలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుభ్రత కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మొదటిరోజు మున్సిపల్ సిబ్బందితో కలిసి 44 వార్డులో కాలువలు శుభ్రం చేసే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గునుగంటి హేమా సతీష్ స్వయంగా కాలువలు శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాల్వలు శుభ్రంగా ఉండి నీరు నిలవకుండా ఉంటే దోమల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు గునుగంటి సతీష్, వార్డు ముఖ్యులు బంధు వీరయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.