పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేష్టకరం

Aug 1, 2026 - 22:06
 0  2
పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేష్టకరం
పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేష్టకరం

-ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి.

 జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండలంలోని
 జన్మించిన శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే శ్రేష్టకరమని  ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి. అన్నారు. 
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సాతర్ల  గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఏఎన్ఎం మాట్లాడుతూ ప్రసవం జరిగిన వెంటనే తల్లి ముర్రుపాలు బిడ్డకు అందడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలతో పాటు పోషకాహారం అందివ్వాలన్నారు.
 రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 1 నుండి7 వరకు తల్లిపాలు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి టీచర్ బియ్యమ్మ బాలింత తల్లులకు గర్భిణులకు సూచనలు తెలియజేశారు.
1.  పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి
2.  6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి
3.  తల్లి నుండి వచ్చే మొదటి పసుపు రంగు చిక్కని పాలు - "కొలొస్ట్రమ్" బిడ్డకు అమృతంతో సమానం
4.  తల్లి అనారోగ్యంగా ఉన్నా సరే బిడ్డకు పాలు ఇవ్వవచ్చు
5.  తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది..........
6. 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహార లోపం తగ్గుతుంది అని తల్లులకు అవగాహన కల్పించారు.
 ఈ కార్యక్రమంలో  ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతరు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333