ఎన్నాళ్ళు ఇలా చెప్పినా పట్టించుకోని మండల ప్రజా పరిషత్ అధికారులు
సీజనల్ వ్యాదులు వచ్చే అవకాశం ఉందంటున్న కాలనీ వాసులు
జోగులాంబ గద్వాల8 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని మాన్ దొడ్డి గ్రామంలో ఓ కాలనీలో తడి పొడి చెత్త ను తీసుకెళ్లడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో కాలనీలో సీజనల్ వ్యాదులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామ పంచాయితీ అధికారి దృష్టికి తీసుకువెళ్లితే అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. ఇదే విషయం మండల ఎంపిడిఓ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. తడి పొడి చెత్తను తొలగించని ఎడల జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ని ప్రజా వాణిలో కలిసి పిర్యాదు చేస్తామని కాలని వాసులు అంటున్నారు.