పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకం

Apr 3, 2025 - 15:14
Apr 3, 2025 - 15:23
 0  39
పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకం

యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచార వేదికగా ప్రతి ఒక్కరు పనిచేయాలి

సూర్యాపేట,తుంగతుర్తి మాకు రెండు కండ్లు

సూర్యాపేట, తుంగతుర్తి లో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత మాది

ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోతం రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.

సూర్యాపేట, 2 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-

కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి,యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి పాలకూర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ,మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,కొప్పుల వేణారెడ్డి, పాలకూర్ల రవికాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం చాలా కీలకమని యూత్ కాంగ్రెస్ లో ఎవరైతే క్రియాశీలకంగా సమర్థవంతంగా చురుకుగా ఉంటారో వారికి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వారేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పథకాలను చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయాలని యువత మరియు నిరుద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచనలు చేసినట్టు తెలిపారు.సమాజంలో మార్పు రావాలంటే ముందుగా యువత బలోపేతం కావాలి యువజన నాయకులు తాము ఉన్న గ్రామాల్లో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాడాలి యువతే ఈ దేశ భవిష్యత్తు. అందుకే మీరు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలి అని సూచించారు.గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నిరంతర చైతన్యం అవసరం ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి, పేద ప్రజలకు మద్దతుగా నిలవాలి యువజన నాయకులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి.సోషల్ మీడియా వేదికగా పార్టీకి మద్దతు ప్రచారం చెయ్యాలన్నారు.జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలని భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అధిష్టానం పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333