పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఫలితం దక్కుతుంది ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 07 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆయా గ్రామాల నాయకులు స్వచ్ఛందంగా ఎన్నుకునే విధంగా కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు గడ్డు కాలములో ఎల్సోజు నరేష్ పార్టీ కోసం నిరంతరం పనిచేశారని చెప్పారు.పార్టీ కోసం పనిచేసే వారిని పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఎవరు కూడా తొందరపడి పదవులు రాలేదని నిరాశ పడవద్దని చెప్పారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే మందుల సామేలు నియామక పత్రాలు అందజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గా చామంతి.
తిరుమలగిరి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఎల్సోజు చామంతి నరేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ గా చింతరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డైరెక్టర్లు గా దేశగాని రాములు, అంగోతు రాములు, గాదరబోయిన ఉప్పలయ్య, బైరబోయిన సైదులు, కండే అంజయ్య, చెరుకు వేణుగోపాలరావు, మహమ్మద్ హఫీజ్, తాటిపాముల జలంధర్, బీరవోలు వాసుదేవరెడ్డి, రాపాక సోమేష్, దొడ్డ రమేష్, పిఎ సి ఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చైర్మన్ డైరెక్టర్లను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సూపర్వైజర్ అనిల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న,జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.