బల్గేర గ్రామం లో రోడ్డుమీద పారుతున్న మురుగునీరు

జోగులాంబ గద్వాల 30 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గట్టు మండల పరిధిలోని బల్గేర గ్రామంలో ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజుల నుంచి మురుకు నీరు కాలనీకి పోయే రోడ్డు మీద మొరుగు నీరు పారుతూనే ఉన్నది. ఆ రోడ్డు పక్కన ఉన్న ఇండ్ల ప్రజలకు దుర్వాసన మరియు ఈగలు దోమల నుండి రోగాల బారిన పడుతున్నారు. అలాగే సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి మురుకు గుంతకు మట్టి మరమ్మతులు చేయాలని గ్రామ ప్రజలు కాలనీవాసులు కోరుతున్నారు.