పాడి పశువులకు గర్భకోష వ్యాధుల చికిత్స శిబిరం
జోగులాంబ గద్వాల 11 డిసెంబర్ 25 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి వేముల గ్రామంలో గల పాడి పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చూడికట్టని,ఎదకు రాని పశువులకు పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి. శివానంద స్వామి పాల్గొని పాడి రైతులకు సూచించడం జరిగింది. సరైన పోషణ ,సమతుల దాణ,పరానా జీవుల నిర్మూలన మరియు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వల్ల పశువులు సకాలంలో ఎదుకు వచ్చి చూడి కడతాయి .సంవత్సరానికి ఒక దూడను పొంది రైతులు ఆర్థికంగా లాభాలు పొందుతారు అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో13 గేదెలు మరియు 5 ఆవులకు చికిత్స అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ వై.భవనేశ్వరి డాక్టర్ వినయ్ కుమార్ మరియు గోపాలమిత్రాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.