పల్స్ పోలియోను విజయవంతం చేయండిRBSK వైద్యులు
సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారం రాథోడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) కింద పనిచేస్తున్న వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు మరియు ఇతర సిబ్బందితో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారం రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధీన పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలను ప్రణాళిక ప్రకారం నిర్వహించి, పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదల మరియు అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని సూచించారు. గుర్తించిన కేసులను జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC)కు సకాలంలో రిఫర్ చేసి, ఫాలోఅప్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డా. తుకారం రాథోడ్ సూచించారు. జిల్లాలోని 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా RBSK బృందాలు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎవరూ మిగిలిపోకుండా ఇంటింటి సర్వేలు నిర్వహించి, వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, గిరిజన ప్రాంతాలు మరియు చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లోని పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు.
అలాగే ఫీల్డ్ విజిట్లు, డేటా నమోదు, నివేదికల సమర్పణ, పెండింగ్ కేసుల పరిష్కారం, రిఫరల్ సేవలు మరియు బృందాల పనితీరుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించి, జిల్లాలో బాలల ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్ నాగభూషణం CHO, RBSK కోఆర్డినేటర్లు, వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.