నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ డాక్టర్ మల్లు రవి గారికి ఇవ్వాలని కోరుతున్నాము

టిపిసిసి ఆర్గనైజర్ సెక్రెటరీ రాములు గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

Mar 1, 2024 - 19:52
Mar 1, 2024 - 19:52
 0  3

వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రెటరీ రాములు గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

టిపిసిసి ఆర్గనైజర్ సెక్రెటరీ రాములు గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అత్యధిక మెజార్టీతో వనపర్తి MLA తూడి మేఘారెడ్డి గారు, గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు వనపర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉందని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్టు డాక్టర్ మల్లురవి గారికి ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు గతంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా డాక్టర్ మల్లు రవి గారు గెలుపొందడం జరిగింది మల్లు రవి సీనియర్ నాయకులు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నాడు అలాంటి వ్యక్తికి నాగర్కర్నూల్ పార్లమెంటు ఎంపీ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలని కోరుచున్నాము కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకులకు టికెట్టు ఇవ్వాలని కోరుచున్నాము కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారికి అడుగులో అడుగై మల్లు రవి గారు తన వయసుకు లెక్కచేయకుండా రేవంతన్న వెంట పాదయాత్రలో డాక్టర్ మల్లు రవి గారు పాదయాత్ర చేయడం జరిగింది తెలంగాణలో ఏ కార్యక్రమం అయినా మల్లు రవి గారు ముందుండేవారు పార్టీ కోసం కష్టపడే నాయకుడు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే మల్లు రవి మల్లు రవి అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కష్టపడ్డ నాయకుడు డాక్టర్ మల్లు రవి గారు డాక్టర్ మల్లు రవి గారు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో కులమత బేధాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ పిలిస్తే పలికే విధంగా డాక్టర్ మల్లు రవి గారు సేవలందించారు మనకు తెలిసిన వ్యక్తి మల్లు రవి గారు మన కుటుంబ సభ్యులు ఎలాగైతే పలకరిస్తారు అలాగే డాక్టర్ మల్లు రవి గారు కూడా పలకరించేవాడు మనకు బంధువుడయ్యాడు డాక్టర్ మల్లు రవి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి ఢిల్లీలో పదవి నియమిస్తే ఆ పదవి వద్దు నాకు నాగర్కర్నూలే మా ఇల్లు నాగర్ కర్నూల్ లో ప్రజలకు నేను సేవలు అందిస్తాను నాకు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ  టికెట్ ఇవ్వాలని కోరడమైనది మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్టు రాని వాళ్ళు ఎంతోమంది నిరుస్తాంగా ఉంటే వాళ్లను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒప్పించి వాళ్లను కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించిన వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తనదంటూ పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారు కావున నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ స్థానం డాక్టర్ మల్లు రవి గారికి ఇవ్వాలని కోరుచున్నామని అన్నారు

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, యాదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు,  యువజన కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి.వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ పిడి జయనందం ఈరపోగు శ్రీనివాసులు ఎం రఘు ఎండి అబ్దుల్ రఫీక్ అంబటి రమేష్ శశాంక్ సాగర్ ఎం రాజు ఏ ఆర్ గౌడ్ తిరుపతయ్య పి వెంకటేష్ కే టిల్లు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333