పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి
సూర్యాపేట : పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్పై హరితహారం ఇంచార్జ్లు వసీం, వసుంధర ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు నిర్వహించి మొక్కలు నాటి మాట్లాడారు. వాతావరణ కాలుష్యం నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని తమ వంతు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటినప్పుడే వాతావరణం చల్లబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.