పదవులలో లేని వ్యక్తులకు ప్రభుత్వ సెక్యూరిటీ ?

Jul 29, 2026 - 01:00
 0  2
పదవులలో లేని వ్యక్తులకు ప్రభుత్వ సెక్యూరిటీ ?

పదవులలో లేని వ్యక్తులకు ప్రభుత్వ సెక్యూరిటీ ? పదవులకే వన్నె తెచ్చిన రాష్ట్ర అడిషనల్ డిజిపి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (విఆర్ఎస్) పై ఎందుకు ఈ కుట్ర,వివక్ష. 

ప్రశ్నించే గొంతుకుల పై అణచివేత,కక్షసాధింపు చర్యలు దుర్మార్గం.  

PDSU గంజిపేట రాజు BRS పార్టీ జిల్లా సీనియర్ నాయకులు.

జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుంభకోణాలు,అవినీతిపై నిర్విరామంగా పోరాటం చేస్తున్నందుకే రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ అడిషనల్ డిజిపి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ (విఆర్ఎస్) పై భద్రత సిబ్బందిని, _'బుల్లెట్ ప్రూఫ్ కార్ ను హోమ్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి అదేశల మేరకు ఈరోజు నుండి బులెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తొలగించారని బిఆర్ఎఎస్ సీనియర్ నాయకుడు గంజిపేట రాజు ఆరోపించారు.'

ఈ సందర్భంగా BRS జిల్లా సీనియర్ నాయకులు గంజిపేట రాజు మాట్లాడుతూ.. మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను కుదించడం పూర్తిగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని గంజిపేట రాజు మండిపడ్డారు. 

ప్రభుత్వ కుంభకోణాలు,అవినీతిపై నిర్విరామంగా పోరాటం చేస్తున్నందుకే రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 26 ఏండ్ల పాటు దేశానికి,సమాజానికి సేవలందించిన ఒక ఉన్నతాధికారి పట్ల ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ఏ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేశ,రాష్ట్ర రక్షణ కోసం ఎన్నో సేవలు చేశారని..గురుకులాల సెక్రటరీగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని,

ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు ప్రజాధనంతో భారీగా ప్రభుత్వ భద్రతను ప్రోటోకాల్ వాహనాలను కల్పిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.కానీ దశాబ్దాల పాటు సమాజానికి దేశానికి సేవలందించి,ప్రస్తుతం ప్రాణహాని ఎదుర్కొంటున్న మాజీ పోలీసు అధికారి RSP కి భద్రత తగించడం ప్రభుత్వ దివాలకోరుతననికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

ఈ రకమైన బెదిరింపులతో ఆయన ఆత్మస్థైర్యాన్ని పోరాట స్ఫూర్తిని తగ్గించలేరని..ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని గంజిపేట రాజు డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333