నేషనల్ హైవే పై కారు దగ్ధం

ఆకు పాముల గ్రామం వద్ద ఘటన
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆకుపాముల సమీపంగా రాగానే ఒకసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాప్తి చెందాయి. మంటలను గమనించి ప్రయాణికులు బయటకు దిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధం అయింది.