నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం

Sep 10, 2026 - 18:19
 0  6
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం

మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., అధికారులకు కీలక సూచనలు

 బీట్ సిస్టమ్, పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలి.. ప్రజలకు కనిపించేలా విజిబుల్ పోలీసింగ్

CCTNS సిబ్బందికి ఎస్పీ అభినందనలు, రివార్డులు

సెప్టెంబర్ 12 జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక శ్రద్ధ..

గణేష్ నవరాత్రులకు ముందస్తు భద్రతా చర్యలు

సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై విస్తృత అవగాహన.. 

గంజాయి, మట్కా, జూదం,  ఇసుక అక్రమ రవాణా, PDS రైస్ ల పై కఠిన చర్యలు.

గద్వాల. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,  జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, బీట్ సిస్టమ్, పెట్రోలింగ్, CCTNS, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ  స్పష్టం చేశారు. దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించబోమని, విధుల్లో అలసత్వం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకునే విధంగా పోలీసింగ్ ఉండాలని సూచించిన ఎస్పీ గారు, బీట్ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసి ప్రతి గ్రామం, కాలనీపై నిరంతర నిఘా ఉండేలా చూడాలని ఆదేశించారు. బీట్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. అదేవిధంగా బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా రాత్రి వేళల్లోనూ నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలని సూచించారు.

CCTNS పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ , జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనూ CCTNSకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన CCTNS సిబ్బంది శాంతినగర్ సర్కిల్ తులసిరామ్ నాయుడు, శాంతినగర్ పీస్-మస్తాన్, మనోపాడ్ పీస్-సుజాత, రాజోలి పీస్-పహ్లద్ రెడ్డి, అయిజ పీస్-ఆకాష్, అలంపూర్ సర్కిల్-రవి, అలంపూర్ పీస్-మహేష్, కోదండపూర్ పీస్-రాంబాబు, ఇటిక్యాల పీస్-మహేష్, ఉండవెళ్లి పీస్-సంతోషమ్మ, గద్వాల్ సర్కిల్-దామోదర్ రెడ్డి, గద్వాల్ టౌన్-రమేష్ బాబు, గద్వాల్ రూరల్ - రఘునాథ్ రెడ్డి, ధరూర్-దనేశ్వరి, గట్టు-ప్రభాకర్, మాల్డాకల్-విజయ్ రాజు లను  ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే అక్రమ గంజాయి రవాణా, ఇసుక అక్రమ రవాణా, PDS రైస్, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించబడిన సొత్తును రికవరీ చేసి బాధితులకు అందించాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ జిల్లాలోని  సర్కిల్ ఆఫీసర్లకు, ఎస్సై లకు సూచించారు. రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలకు అవగాహన కల్పిస్తూ న్యాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారు ఆదేశించారు.  గణేష్ మండపాల నిర్వహకులు ప్రతి మండపం డీటెయిల్స్ లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గణేష్ మండపాలు, నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్, ప్రజల రాకపోకలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని సంబంధిత శాఖలు, నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ కార్యక్రమాలను, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె.శంకర్, డీఎస్పీ గద్వాల వై. మొగిలయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, CCTNS సిబ్బంది మరియు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333