నేటిపిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలు
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్ నవంబర్ 14) : నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలని నాడు ప్రధాని నెహ్రూ అన్నారని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవం గా జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు. బాలలు నేడు సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ ఫోన్ల ఫలితంగా అనేక దుష్పరిణామాలకు గురవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా విద్యపై అవగాహన కల్పించాలని చెప్పారు. భవిష్యత్తులో దేశాన్ని అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో నేటి బాలులే భవిష్యత్తు తరాల్లో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. బాలల దినోత్సవానికి భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పిల్లల హక్కులను వారి విద్య ఆరోగ్యం భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం ఈ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పండిత జవహర్ లాల్ నెహ్రు పిల్లలను దేశ భవిష్యత్తుగా భావించి వారికి గౌరవం ఇవ్వడం మరియు వారి అభిరుచులు కలల పట్ల శ్రద్ధ చూపించడంలో నమ్మకం కలిగేవారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవం ద్వారా పిల్లల పట్ల సమాజం జాగృతమవడం వారి హక్కులు మరియు అవసరాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ప్రేమ పాఠశాల విద్యను అందించడంతోపాటు వారిలో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది అని వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు.